గుబులు రేపుతున్న బంగారం ధర..

గుబులు రేపుతున్న బంగారం ధర..

gold

బంగారం ధర గుబులు రేపుతోంది. వరుసగా రెండో రోజు కూడా భారీగా పెరిగింది. ఢిల్లీలో సోమవారం ఒక్క రోజే ఏకంగా 720 రూపాయలు పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరుకుంది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 41 వేల 730కి చేరుకుని రికార్డు సృష్టించింది. అంతకుముందు సెషన్‌లో ఈ ధర 10 గ్రాములకు 41 వేల 10 రూపాయల వద్ద ముగిసింది. రెండు రోజుల్లో పది గ్రాముల బంగారం ధరపై 18 వందలం పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 పెరిగి 38 వేల 320 రూపాయలకుకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 390 పెరిగి 41 వేల 770కి చేరింది.

మరోవైపు, బంగారంతోపాటే వెండి కూడా కిలోకు 11 వందల 5 రూపాయలు పెరిగి 49 వేల 430కి చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో వెండి కిలోకు 48 వేల 325 వద్ద ముగిసింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల వ్యాపారులు భారీగా కొనుగోలు చేయడం వల్ల వెండి ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి.

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమే బంగారం ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌పై అమెరికా దాడి చేసినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు సురక్షితంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపారు. ఫలితంగా బంగారం ధర అమాంతం పెరిగింది. అదే సమయంలో ఈ ఉద్రిక్తత కారణంగా రూపాయి విలువ భారీగా పడిపోయింది. బంగారం ధర పెరుగుదల ప్రభావం వల్ల డాలర్‌తో రూపాయి మారకం విలువ 72 మార్క్‌ దిగువకు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story