టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ సహా టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోకేష్‌తోపాటు ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చినకాకాని వద్ద రైతులు ఆందోళన చేస్తున్న చోటికి వెళ్తున్నారన్న అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారు. తాము పార్టీ ఆఫీస్‌కే వెళ్తున్నట్టు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఈ అరెస్టులు, నిర్బంధంపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో గద్దె రామ్మోహన్ చేస్తున్న దీక్షకు లోకేష్ సంఘీభావం తెలిపారు. అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. అందరినీ అరెస్టు చేసి యనమలకుదురు వైపు తీసుకెళ్లారు. అట్నుంచి కరకట్ట మీదుగా తోట్లవల్లూరు తీసుకెళ్లారు. తమని ఎందుకు అదుపులోకి తీసుకుంటారని లోకేష్ నిలదీసినా పోలీసులు స్పష్టమైన సమాధానం చెప్పలేదు. బలవంతంగా వాళ్లను వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com