నిర్భయ దోషులకు జైలులో ఆంక్షలు

నిర్భయ దోషులకు జైలులో ఆంక్షలు

nirbaya

నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. జనవరి 22 నిర్భయ దోషులకు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని పటియాలా కోర్టు ఆదేశించింది. నలుగురు దోషులను ఉరి తీయడానికి బీహర్‌ నుంచి ప్రత్యేకంగా తాళ్లు తెప్పించారు. 10 ఉరి తాళ్లు లోని బక్సర్ జైలు నుంచి తీహార్ జైలుకు చేరాయి. వాటిని మనీలా తాళ్లు అంటారు. దోషులు అతితక్కువ నొప్పితో ప్రాణాలు పోవడానికి వీలుగా ఆ తాళ్లను మృదువుగా, బలంగా తయారు చేశారు. అలాగే, మీరట్ జైలు నుంచి తలారి పవన్ కుమార్‌ను తీహార్ జైలుకు తాత్కాలికంగా పంపించారు.

పవన్ కుమార్ ప్రొఫెషనల్ తలారీగా గుర్తింపు పొందాడు. ఏ మాత్రం నొప్పి తెలియకుండా ఉరి తీయడం, క్షణాల్లోనే ప్రాణాలు పోయే లా జాగ్రత్తలు తీసుకోవడంలో పవన్ కుమార్‌ అనుభవశాలి. గతంలో సీరియల్ కిల్లర్ సురేందర్ కోలీని ఉరి తీసింది పవన్ కుమారే.

నలుగురు దోషులకు తీహార్ జైలు అధికారులు ఆంక్షలు విధించారు. వాళ్లను వేర్వేరు గదుల్లోకి షిఫ్ట్ చేశారు. వాళ్లు కలుసుకోకుండా, మాట్లాడుకోకుండా రూల్స్ పెట్టారు. ముకేష్, వినయ్‌ శర్మ, అక్షయ్‌ సింగ్‌‌లు జైలులో ఉదయం వేళ పరస్పరం కలుసుకొని మాట్లాడుకునేవారు. ఐతే, ఉరితీసే సమయం దగ్గర పడడంతో ఆ నలుగురు కలుసుకొని మాట్లాడుకోకుండా నిషేధం విధించారు. మండోలీ జైలులో ఉన్న మరో దోషి పవన్ కుమార్ గుప్తాను కూడా తీహార్ జైలుకు తీసుకువచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story