తాజా వార్తలు

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు
X

bandi-sanjay

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. CAA ను వ్యతిరేకిస్తున్న వారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్‌కు పంపిస్తామని అన్నారు. ఆందోళనలు చేసే వారికి గట్టిబుద్ధి చెబుతామన్నారు. వారు కర్రలు పడితే తాము కత్తులు పడతామని... వారు రాళ్లు విసిరితే తాము బాంబులు విసురుతామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ దేశం విచ్ఛిన్నం కావాలనే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చూస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను దాచి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న మూర్ఖపు పార్టీల వల్లనే ఈ ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని... కేవలం పక్క దేశాల్లో ఉన్న హిందువులకు పౌరసత్వం ఇవ్వడానికి తీసుకొచ్చిందని బండి సంజయ్‌ తెలిపారు.

Next Story

RELATED STORIES