అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకున్న పోలీసులు

X
TV5 Telugu8 Jan 2020 1:04 PM GMT
విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్రను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సుయాత్రకు సన్నాహాలు చేసింది అమరావతి పరిరక్షణ సమితి. అయితే.. ఈ బస్సు యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో బస్సుల్ని నిలిపివేశారు. పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతి పరిరక్షణ సమితి నేతలు.
Next Story