ఇదెక్కడి గొడవ.. పాప్‌కార్న్ పంట్లో ఇరుక్కుందని గుండెకు ఆపరేషన్..

ఇదెక్కడి గొడవ.. పాప్‌కార్న్ పంట్లో ఇరుక్కుందని గుండెకు ఆపరేషన్..

Aadam

పాప్‌కార్న్ తినడం ఎంత పాపమైపోయింది. సినిమా చూస్తూ కాలక్షేపం కోసం పాప్‌కార్న్ నోట్లో వేసుకుంటే అది కాస్తా పంట్లో ఇరుక్కుని పడుకోనివ్వకుండా చేసింది. ప్రాణాలకే ప్రమాదాన్ని తీసుకువచ్చింది. యూకేకు చెందిన అడమ్ మార్టిన్ పాప్ కార్న్ తిన్నాడు. తినేటప్పుడు పంటి కింద ఇరుక్కుంది. పట్టించుకోలేదు. కానీ ఇబ్బందిగా ఉంది బయటకు రావట్లేదు.

బ్రష్ చేసుకున్నా పోలేదు. టూత్ పిక్‌తో ట్రై చేశాడు. రాలేదు.. గుండు సూది పెట్టి తీసే ప్రయత్నం చేశాడు. అయినా పాప్‌కార్న్ ముక్క బయటకు రాలేదు. పంటికీ, చిగురుకి పిన్ను గుచ్చీ గుచ్చీ ఇన్‌ఫెక్షన్‌కి గురైంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, విపరీతంగా చెమటలు పట్టడం తలనొప్పి రావడం, అలసటగా అనిపించడం వంటి వాటితో ఇబ్బంది పడ్డాడు. నొప్పి భరించలేక ఓ రోజు ఆసుపత్రికి వెళదామనుకున్నాడు.

ఇంతలో జ్వరం కూడా రావడంతో ఆసుపత్రికి పరిగెట్టాల్సి వచ్చింది. మార్టిన్‌ని పరీక్షించిన వైద్యులు పంటి చిగురుకు గాయం అవడంతో అక్కడ బ్యాక్టీరియా చేరిందని చెప్పారు. అది రక్తం ద్వారా గుండె లోపలి పొరల్లోకి చేరుకుందని అన్నారు. అలానే వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదమని అర్జంట్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత ఆడమ్ మాట్లాడుతూ పంటిలో ఇరుక్కున్న పాప్ కార్న్ కారణంగా చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. దాని పర్యవసానం ఇలా ఉంటుందని ఊహించలేదన్నాడు.

మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ అయ్యి కోలుకుంటున్నాడు. పంటిలో పాప్ కార్న్ ఇరుక్కున్నా, కంటిలో నలుసు పడ్డా వదిలేయడానికి లేదండీ బాబు.. ఏది ఎక్కడికి దారి తీస్తుందో ఉహించడానికే కష్టంగా ఉంది. అన్నిటికీ హాస్పిటల్‌కి పరిగెట్టడమే మార్గంగా కనిపిస్తుంది. లేకపోతే ఇదిగో ఇలానే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

Read MoreRead Less
Next Story