క్రైమ్

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట ప్రధాన రహదారిలోని కాసిపెంట్ల వద్ద అమరావతి వోల్వో బస్సు-ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ డ్రైవర్‌ స్టీరింగ్‌ మధ్యలో ఇరుక్కుపోయాడు. స్థానికులు డ్రైవర్‌ను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. అమరావతి వోల్వో బస్సు విజయవాడ నుంచి కుప్పం వెళ్తుంది. అటు.. శబరిమల నుంచి నల్గొండకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు అయ్యప్ప స్వాములతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Next Story

RELATED STORIES