శంషాబాద్‌లో బీటెక్ సెకండియర్ స్టూడెంట్ మిస్సింగ్

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లో భరత్ అనే బిటెక్ విద్యార్థి అదృశ్యం మిస్టరీగా మారింది. ఎగ్జామ్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడని తండ్రి మందలించడంతో అతను హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. భరత్ హాస్టల్ నుంచి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థి తండ్రి RGIA పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పద్మారం గ్రామానికి చెందిన భరత్ కుటుంబం కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని వాంబే కాలనీలో నివాసం ఉంటోంది. వర్ధమాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న భరత్ స్థానిక బెస్ట్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. సెకండియర్‌లో రెండు సబ్జెక్టులు ఫెయిలవడంతో తండ్రి మందలించాడు. దీంతో జనవరి 5న రాత్రి పదిన్నరకు మొబైల్‌ను హాస్టల్‌లో వదిలేసి వెళ్లిపోయాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com