తత్కాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఇలా చేసుకుంటే ఈజీగా..

తత్కాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఇలా చేసుకుంటే ఈజీగా..

tatkal-booking

ఊరు ఎప్పుడు వెళ్లేది కన్ఫామ్ కాలేదని ట్రైన్ టికెట్ నెల రోజుల ముందు బుక్ చేసుకోలేక తత్కాల్‌ని ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రయాణం రేపంటే ఈ రోజు తత్కాల్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏసీ క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్‌కు ఉదయం 11 గంటలకు తత్కాల్ కౌంటర్ ఓపెన్ అవుతుంది. సెకంట్ క్లాస్‌ టికెట్ కోసం బేసిక్ ఫేర్ పైన 10 శాతం, ఇతర క్లాసులకు 30 శాతం అదనంగా చెల్లించాలి. తత్కాల్ టికెట్లు క్షణాల్లో బుక్ అవుతుంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి బుక్ చేస్తేనే టికెట్ దొరుకుతుంది.

మీ ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ కావాలి. book your ticket పేజ్‌లో ప్రయాణ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాతి పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి. బుక్ చేయాలనుకున్న ట్రైన్ పైన క్లిక్ చేసి క్లాస్ ఎంచుకోవాలి. తత్కాల్ టికెట్ కోసం కోటా ఆప్షన్‌లో Tatkal పైన క్లిక్ చేయాలి. చివరిగా book now బటన్ పైన క్లిక్ చేయాలి. ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేయాలి. టికెట్ బుకింగ్ సమయంలో consider for auto upgradation ఎంచుకుంటే ఆటోమేటిక్ క్లాస్ అప్‌గ్రేషన్ వర్తిస్తుంది. అంటే మీరు ఎంచుకున్న క్లాస్ కన్నా పై క్లాస్‌లో సీట్లు ఖాళీగా ఉంటే టికెట్లు బుక్ అవుతాయి. ప్యాసింజర్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి Next బటన్ పైన క్లిక్ చేయాలి. అన్ని వివరాలు ఓసారి సరి చూసుకుని బుకింగ్ కొనసాగించాలి. తర్వాత క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. తత్కాల్ ఇ-టికెట్‌లో ఒక పీఎన్‌ఆర్‌కు గరిష్టంగా నలుగురు ప్రయాణీకుల్ని మాత్రమే అనుమతిస్తారు. తత్కాల్ కోటాలో ఎలాంటి కన్సెషన్స్ వర్తించవు.

Read MoreRead Less
Next Story