కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
X

karimnagar

కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 60 కొర్పొరేటర్ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ రిటర్నింగ్ అధికారులు స్థానికంగా నోటీసులు జారీ చేసి అనంతరం ఉదయం పదిన్నార నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 13న నామినేషన్లను పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఈనెల 14 వరకు జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోనేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 16వ తేది లోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చింది. అనంతరం అభ్యర్ధుల తుదిజాబితా ఖరారు చేసి గుర్తులు కేటాయిస్తారు. ఈనెల 24న పోలింగ్‌, 27న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Tags

Next Story