అమరావతిలో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. వేదిక కార్యాలయానికి చేరుకున్న మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ ను పోలీసులు అరెస్టుచేశారు. వేదిక చుట్టుపక్కల ఉన్న షాపులను అధికారులు బలవంతంగా మూసివేశారు. ప్రశాంతంగా ఉద్యమం చేస్తుంటే పోలీసులు రెచ్చగొడుతున్నారని ఈ సందర్బంగా శ్రీధర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మరోవైపు రాజధాని అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. మహిళలని చూడకుండా ప్రవర్తిస్తున్నారు. శుక్రవారం సందర్బంగా గ్రామదేవతలకు నైవేద్యం పెట్టేందుకు వెళ్తున్నవారిని సైతం అడ్డుకొని ఓవరాక్షన్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై గ్రామస్తులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి దమనకాండను మరెప్పుడు చూడలేదని వారు ఆరోపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com