Top

అక్కడ దేవుడికి ఉల్లిపాయే నైవేద్యం.. హిందూ, ముస్లింలు కలిసి..

అక్కడ దేవుడికి ఉల్లిపాయే నైవేద్యం.. హిందూ, ముస్లింలు కలిసి..
X

gogaji-temple

ఎక్కడైనా దేవుడికి నైవేద్యంగా పండ్లు, ఫలహారాలు పెడతారు. కానీ రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జిల్లా, గోడిమెడ పట్టణంలో ఉన్న 950 ఏళ్ల నాటి గోగాజీ ఆలయంలో దైవానికి ఉల్లిపాయలను భక్తులు నైవేద్యంగా పెడతారు. ఆలయంలో కొలువుదీరి ఉన్న గోగాజీ మహారాజ్‌, కాళికా దేవి, సర్పదేవుడికి ఉల్లిపాయలను నైవేద్యంగా సమర్పిస్తారు. ప్రతి ఏటా భాద్రపద మాసంలో ఇక్కడ అత్యంత ఘనంగా గోగాజీ మేళాను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయ సందర్శనకు భక్తులు పోటెత్తుతారు. పెద్ద సంఖ్యలో బారులు తీరుతారు.

ఒక్క రాజస్థాన్ వాసులే కాక పక్క రాష్ట్రాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శిస్తారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి అనేక నగరాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయానికి చెందిన మరో విశేషం.. హిందువులతో పాటు ముస్లింలు కూడా ఆలయ సందర్శనకు వస్తారు. భక్తులు స్వామి వారికి పప్పు, ఉల్లిపాయలను కానుకలుగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించే ఉల్లిపాయలను ఆలయ పరిసరాల్లో ఉండే ఆవులకు ఆహారంగా ఉపయోగిస్తారు.

Next Story

RELATED STORIES