Top

దారుణం : స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి

దారుణం : స్తంభానికి కట్టి మహిళపై చెప్పులతో దాడి
X

WOMENసిద్దిపేట జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లితాండలో దారుణం జరిగింది. స్థల వివాదంలో అదే గ్రామానికి చెందిన కొందరు జ్యోతి అనే మహిళను స్తంభానికి కట్టేసి అమానవీయంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

పక్కనే ఉన్న లక్ష్మీపురం గ్రామానికి చెందిన హంస, స్వరూప, రమకు పోరెడ్డిపల్లితండాలో వ్యవసాయ భూములున్నాయి. అయితే అందులోకి వెళ్లేదారి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఆ మహిళల భర్తలపై జ్యోతి ఫిర్యాదు చేసింది. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ వారు గ్రామంలోకి వెళ్లి జ్యోతిని స్తంభానికి కట్టేసి కొట్టారు. బాధిత కుటుంబ సభ్యులు డయల్‌ 100కి కాల్‌ చేయగా... పోలీసులు వచ్చి జ్యోతిని విడిపించారు.

Next Story

RELATED STORIES