తాజా వార్తలు

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతులు

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతులు
X

asleelaహైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 10లోని టాట్‌ పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయనే సమాచారంతో... వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసులతో పాటు ఎక్సైజ్‌ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఓ ప్రైవేటు సంస్థ ఈ పబ్‌లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అశ్లీల నృత్యాలు చేస్తోన్న యువతులను జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు ఈ సందర్భంగా.. యువతులు హల్‌ చల్‌ చేశారు. మీడియాపై దాడులు చేశారు. మీడియా ప్రతినిధుల ఫోన్లను నేలకేసి కొట్టారు. మొత్తం 22 మంది యువతులను అదుపులో తీసుకున్నారు పోలీసులు

Next Story

RELATED STORIES