ఆర్బీఐ వైపు మరోసారి కేంద్రం చూపు..?

ఆర్బీఐ వైపు మరోసారి కేంద్రం చూపు..?

rbi

కేంద్ర ప్రభుత్వం మరోసారి రిజర్వ్ బ్యాంక్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ఆదాయాల అంచనాలు తప్పడంతో ఆర్బీఐ నుంచి మధ్యంతర డివిడెండ్ తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. మార్చ్ 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ నుంచి 45 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఈ వార్తలపై ఆర్బీఐ ఇంతవరకు స్పందించలేదు. ఐతే, ప్రభుత్వానికి మరో విడత నిధులు చెల్లిస్తే ఆర్బీఐ ప్రొవిజన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆర్బీఐ బోర్డులో ప్రభుత్వ నామినీలు ఉండటంతో నిధుల కేటాయింపు పెద్ద సమస్య కాకపోవచ్చని చెబుతున్నారు.

కరెన్సీ-బాండ్ల ట్రేడింగ్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఆదాయం పొందుతుంది. ఇందులో తన కార్యాకలాపాల కోసం కొంత మొత్తం ఉంచుకొని మిగిలిన మొత్తం ప్రభుత్వానికి ఇస్తుంది. గత ఏడాది లక్ష 23 వేల కోట్ల రూపాయలు కోట్లు ఆర్జించింది. ఇది, అంతకు ముందు ఏడాది కంటే ఇది చాలా ఎక్కువ. ఇక, ప్రత్యేక సందర్భాల్లోనే ఆర్‌బీఐ అదనపు నిధులను ప్రభుత్వా నికి కేటాయించాలని బిమన్ జలాన్ కమిటీ సూచించింది. గత ఏడాది లక్ష 76 వేల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో చెల్లించారు. ఐతే, ఈ ఏడాది వృద్ధి రేటు పడిపోయింది. 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి జీడీపీ రేటు దిగజారింది. ఈ నేపథ్యంలో ఈ సారి బడ్జెట్‌లు వ్యయాలు పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌లో మౌలిక సదుపాయల రంగంపై ఫోకస్ పెట్టడంతో పాటు పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశముంది.

Tags

Read MoreRead Less
Next Story