ఇంత క్యూట్‌గా, అందంగా ఉండడానికి నేనేం తింటానో తెలుసా..!!

ఇంత క్యూట్‌గా, అందంగా ఉండడానికి నేనేం తింటానో తెలుసా..!!

rashmika

సరిలేరు నీకెవ్వరులో మహేష్‌బాబుని అన్నాను కానీ.. నిజానికి నేను కూడా సో క్యూట్, సో స్వీట్ అండీ అని అంటోంది మేడం రష్మికా మందన. ఎందుకంటే వెజిటేరియన్‌గా మారిపోయాను.. అయితే నాకు కూరగాయలు ఏవీ ఇష్టం వుండదు. టమోటాలు, బంగాళదుంపలు, దోసకాయ, క్యాప్సికమ్ తినను అంటోంది. ఈ మధ్య ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఇటలీ వెళ్తే అక్కడ కూరలు తినలేక ఐస్‌క్రీం తిని కడుపునింపుకున్నాని రష్మిక తెలిపారు. ప్రతి రోజు ఉదయం లేవగానే లీటర్ నీళ్లు తాగుతాను.. వర్కవుట్లు చేస్తాను. ఒకవేళ ఉదయం షూటింగ్ వుంటే సాయింత్రమైనా సరే ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తానని తెలిపింది. దక్షిణాది వంటలు ఎక్కువగా ఇష్టపడుతుందట. అన్నం తక్కువగా తిని ప్రూట్స్, సలాడ్లు ఎక్కువగా తింటానని చెబుతోంది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నీకు అర్థమవుతోందా అంటూ సందడి చేసిన రష్మిక ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది.

Read MoreRead Less
Next Story