నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

నేడు వైఎస్‌ జగన్, కేసీఆర్‌ భేటీ

Screenshot_1

దాదాపు మూడున్నర నెలల తరువాత తెలుగు రాష్ట్రాల సీఎంలు మరోసారి భేటీ కాబోతున్నారు. జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటవెంటనే 3 సార్లు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల సమస్యలు, కృష్ణా గోదావరి నదుల అనుసంధానం పై చర్చించారు. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కూడా ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించారు. నదుల అనుసంధానం ఉమ్మడిగా చేపట్టాలని తెలంగాణలో ఏదో ఒక చోట నుండి గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించాలని భావించారు. దీనిపై పై అధ్యయనానికి ఆదేశించారు.దీనికయ్యే ఖర్చును ఇరు రాష్ట్రాలు భరించాలని నిర్ణయించారు. కానీ దీనిపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీని స్థానంలో పోలవరం నుండి బనకచర్ల కు నీటిని తరలించేందుకు సొంతంగా ప్రణాళికలు చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం....

మూడునెలలు ఇరు రాష్ట్రాల సీఎంలు బేటీ కాకపోవడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం సాగింది. ఇప్పుడు తిరిగి ఇద్దరు భేటీ అవుతుండటంతో... ఆసక్తి నెలకొంది. అందులోనూ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్ హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కుల కు పెంచుతామని జగన్ ప్రకటించారు. ఇవన్నీ కాస్త దూరం పెంచాయి. కేంద్రంతో సంబంధాలపై కూడా జగన్ కు కేసీఆర్ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. పార్లమెంట్లో సీఏఏ చట్టానికి వైసీపీ మద్దతు తెలపగా టీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఇక విభజనకు సంబంధించిన అంశాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో ధర్మాధికారి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినా ..ఏపీ అంగీకరించడం లేదు. దీంతో తెలంగాణ నుండి నుండి రిలీవైన 613 మంది ఉద్యోగులను ఏపీ చేర్చుకోవడం లేదు....

అటు.. ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు ఇబ్బంది కలిగించాయి. కేసీఆర్ ఆర్టీసీ విలీనం సాధ్యం కాదన్నారు. అయితే కేసిఆర్ అన్నందుకైనా చేసి తీరుతామని చూపిస్తామన్నారు ఏపీ మంత్రి పేర్ని నాని. అంతేకాకుండా ఉద్యోగుల పీఆర్ సి విషయంలో ఏపీ తీసుకున్న నిర్ణయం కూడా తెలంగాణకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఒక రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలు మరొక రాష్ట్రానికి ఇబ్బందికరంగా మారాయని ఇద్దరు ముఖ్యమంత్రులు అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. 9 10 వ షెడ్యూల్ సంస్థల విభజన కూడా రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాలేదు.

ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటి వరకు అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో..ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఏకాంతంగా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు క్షీణించాయన్న ప్రచారం ఈ నేపథ్యంలో మళ్లీ ఇవాళ సమావేశం కానుండటంతో ఆసక్తి నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story