కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

kite-and-sweet-festival

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్‌ ప్లేయర్స్‌ తరలివచ్చారు. కైట్‌ ఫెస్టివల్‌తో పాటు వెయ్యికి పైగా మిఠాయిలు కొలువుదీరాయి. అన్ని రాష్ట్రాల మిఠాయిలు, స్నాక్స్‌తో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఒక మినీ ఇండియా అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారని.. ఎన్నో మతాలకు హైదరాబాద్‌ నెలవుగా మారిందన్నారు కేటీఆర్‌. హైదరాబాద్‌ మినీ ఇండియా.. గుజరాతీ గల్లీ, పంజాబీ బాగ్‌, సింధి కాలనీ, పార్శీగుట్ట ఇక్కడ ఉన్నాయన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు హైదరాబాద్‌లో ఉన్నారని మంత్రి తెలిపారు. కైట్‌ ఫెస్టివల్‌గా ప్రారంభమైన ఇది.. స్వీట్‌ ఫెస్టివల్‌ వరకు విస్తరించిందన్నారు. దేశ, విదేశాలకు చెందిన కైట్ రైడర్స్ ఈ ఫెస్టివల్‌ లో పతంగులు ఎగురవేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మూడు రోజుల పాటు ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఫెస్టివల్‌ను ఐదు సంవత్సరాల నుంచి విజయవంతంగా నడిపిస్తున్నందుకు టూరిజం శాఖను కేటీఆర్‌ అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story