15 మంది రైతులు చనిపోతే స్పందించని పోలీసులు.. ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలితే స్పందించారు: లోకేష్

15 మంది రైతులు చనిపోతే స్పందించని పోలీసులు.. ఎమ్మెల్యే కారు అద్దాలు పగిలితే స్పందించారు: లోకేష్

nara-lokeshఅమరావతి కేవలం 29 గ్రామాల సమస్య కాదని.. 5 కోట్ల ఆంధ్రుల సమస్య అన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. నాడు అమరావతిని రాజధానిగా అంగీకరించిన జగన్ ఇప్పుడు మాట తప్పారని అన్నారు. అమరావతిలో అన్ని సౌకర్యాలు సమకూరినప్పటికీ.. 3 రాజధానుల పేరుతో జగన్ రాస్ట్రంలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధానిని ఎలా నిర్మించాలో తెలుసని.. సైబరాబాద్ ను నిర్మించి తెలంగాణ ఆదాయం పెంచిన ఘనత ఆయన సొంతమని అన్నారు.

ఎప్పుడూ లేనివిధంగా రాజధాని కోసం మహిళలు రోడ్డెక్కారని లోకేష్ అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మహిళలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళలను కులం అడిగి, కుల రాజకీయాలకు శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. 15 మంది చనిపోతే స్పందించని పోలీసులు.. ఓ ఎమ్మెల్యే కారు అద్దాలు పలిగితే మాత్రం స్పందించారని అన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు పోరాడతామని లోకేష్ స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story