భవిష్యత్ కార్యాచరణపై జనసేన చర్చలు

భవిష్యత్ కార్యాచరణపై జనసేన చర్చలు

pavan

తెలుగు గడ్డపై జనసేన పురుడు పోసుకొని ఆరేళ్లు కావొస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన పార్టీకి పవన్ చరిష్మా పాపులారిటీ తీసుకొచ్చినా.. బ్యాలెట్ మందు మాత్రం బోర్లా పడుతోంది. కొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. దీంతో ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తుకు పెట్టుకొని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూనే తమ సొంత పార్టీని కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యచరణ రూపొందిస్తోంది. దీనిపై చర్చించేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.

గంటన్నర పాటు జరిగిన సమావేశంలో బీజేపీతో పొత్తు, స్థానిక ఎన్నికలకు సన్నద్ధత, పార్టీని రూట్ స్థాయి నుంచి బలంగా ఉండేలా అనుసరించాల్సిన విధానాలను డిస్కస్ చేశారు. క్రీయాశీల కార్యకర్తలు మరింత చురుగ్గా పార్టీ కోసం పనిచేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మరోవైపు ఈ సమావేశంలో రానున్న నాలుగు వారాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ కోసం కష్టపడే వారి జాబితాలు తయారు చేయాలన్నారు.

ఈ నెల చివరి వారం నుంచి కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని.. బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో చర్చించాలన్నారు పవన్‌ కల్యాణ్‌. కొన్నేళ్లుగా పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలందరినీ గుర్తించి, ఆదరించాలని నిర్ణయించారు. జాతీయ, ప్రాంతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, పబ్లిక్ పాలసీలు, పార్టీ ఆలోచనా విధానం, వర్తమాన రాజకీయ అంశాలపై ఎంపిక చేసిన కార్యకర్తలకు వర్క్ షాప్స్ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించాలన్నారు.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన యువ అభ్యర్ధులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు పార్టీలో ఉంటూ సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉన్నవారితో సేవాదళ్ ను పటిష్టంగా రూపొందించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story