జీవిత కాలం అధికారంలో ఉండేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం

జీవిత కాలం అధికారంలో ఉండేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం

putin

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బాటలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొలిటికల్ కేరీర్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రెసిడెంట్ పుతిన్.. రాజకీయాల్లోనూ సంచలన సంస్కరణలకు అమలు చేస్తున్నారు. దీంతో ఇక జీవితకాలం తానే అధికారంలో ఉండేలా ప్లాన్ చేశాడు పుతిన్. 2024 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్న పుతిన్.. ఆ తర్వాత కూడా అధికారంలో ఉండాలనే వ్యూహంలో ఉన్నాడు. రష్యా ప్రధానిగా పగ్గాలు చేపట్టాలనే ఉద్దేశంతో ఉండటం వల్లే ప్రైమ్ మినిస్టర్ పదవికి విస్తృతాధికారాలు కట్టబెడుతూ సంస్కరణలు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

1999లో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇప్పటివరకు పుతిన్ అధ్యక్ష, ప్రధాని బాధ్యతలను నిర్వహించారు. ఆయన ఆధ్వర్యంలోనే రష్యా మళ్లీ పుంజుకుంది. అయితే.. దేశం కోసం తానే ఎప్పటికీ అధికారంలో ఉండాలని భావిస్తున్నారు. పుతిన్‌ ఇదివరకే 1999-2008లో వరుసగా రెండుసార్లు దేశ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాడు. రష్యా రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం మూడోసారి పోటీచేయకూడదు. అయితే విరామం తరువాత ఎన్నికల్లో పాల్గొనవచ్చు. దీంతో సెకండ్ టర్మ్ ముగియగానే పుతిన్ తన నమ్మకస్తుడైన దిమిత్రీ మెద్వదేవ్‌ను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాడు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టి.. మెద్వదేవ్ ను వెనకుండి నడిపించాడు.

ఇప్పుడు 2024తో పుతిన్ అధ్యక్ష పదవి ముగియనుంది. దీంతో తాను ఎప్పటికీ అధికారంలోనే ఉండేలా కొన్ని కీలక సంస్కరణలు చేపట్టారు పుతిన్. చట్టసభ సభ్యులే ప్రధాన మంత్రిని, మంత్రివర్గాన్ని ఎన్నుకోవాలని, అధికారంలో వారికి పూర్తి స్వేచ్ఛనివ్వాలని పేర్కొంటూ ప్రధాని దిమిత్రీ మెద్వదేవ్‌ సంస్కరణలను ప్రతిపాదించారు. పుతిన్‌కు ఎంతో విశ్వసనీయుడైన మెద్వదేవ్‌.. సంస్కరణలను ప్రతిపాదించిన వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. రష్యా డ్యూమా నూతన ప్రధానిని ఎన్నుకోనుంది. ఇక ప్రెసిడెంట్ గా తన పదవీకాలం ముగియగానే పుతిన్ చట్టసభల ప్రధానిగా బాధ్యతలు చేపడతారని అంటున్నారు. అందుకే అందుకే ప్రధానికి మరిన్ని విస్తృతాధికారాలు కట్టబెడుతూ సంస్కరణలు తీసుకొచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story