స్త్రీలను క్షోభపెట్టిన రాజులు.. చరిత్రలో కలిసిపోయారు : రాజధాని మహిళలు

అదే పట్టుదల.. అదే ఆశయం.. 33 రోజులైనా రాజధాని రైతుల పోరాటం సడలలేదు. నెలరోజులకుపైగా దీక్షలు, నిరసనలు, ర్యాలీ చేస్తోన్న మహిళలు.. ఆదివారం మందడం, వెలగపూడి నుంచి దుర్గ గుడి వరకు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా చూడాలంటూ బెజవాడ కనక దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకోనున్నారు. మందడం నుంచి 13 కిలోమీటర్లు పాదయాత్రలో.. యువతులతో పాటు 70 ఏళ్లకు పైబడిన వృద్ధమహిళలు సైతం పాల్గొంటున్నారు.
ముఖ్యమంత్రి జగన్‌లో మార్పు రావాలని.. రాజధాని అమరావతిలోనే ఉంచాలని కోరుతున్నారు మహిళలు. నెలరోజులకుపైగా తీవ్రక్షోభ అనుభవిస్తున్నామని, మహిళలను క్షోభపెట్టొద్దని ముఖ్యమంత్రి జగన్‌కు వేడుకుంటున్నారు. స్త్రీలను క్షోభపెట్టిన రాజులు.. చరిత్రలో కలిసిపోయారంటూ గుర్తు చేస్తున్నారు రాజధాని మహిళలు. ఈ పోరాటంలో తాము వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com