Top

అమరావతి మంటలతో చలికాచుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం : ధూళిపాళ్ల నరేంద్ర

అమరావతి మంటలతో చలికాచుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం : ధూళిపాళ్ల నరేంద్ర
X

అమరావతి మంటలతో తెలంగాణ ప్రభుత్వం చలికాచుకుంటోందంటూ ఘాటుగా విమర్శించారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. జగన్‌- కేసీఆర్‌తో 6 గంటల ఏకాంత సమావేశంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారాయన. ఏపీ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రమే బాగుపడుతోందన్నారు. జగన్‌ను శభాష్‌ అని భుజం తట్టిన కేసీఆర్.... హైదరాబాద్‌లో ఉన్న పరిపాలన భవనాలను విభజించేందుకు ఇష్టపడుతున్నారా అని ప్రశ్నించారు. ఉత్తర దక్షిణ, మధ్య తెలంగాణగా హైదరాబాద్‌ను విభజించేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 13 జిల్లాలున్న ఏపీకి మూడు రాజధానులు చేస్తే... 33 జిల్లాలున్న తెలంగాణకు ఎన్ని రాజధానులు కావాలని ప్రశ్నించారు ధూళిపాళ్ల.

Next Story

RELATED STORIES