అగ్రస్థానంలో హైదరాబాద్‌

అగ్రస్థానంలో హైదరాబాద్‌

పంచంలోనే అత్యంత క్రియాశీల నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. శుక్రవారం రాత్రి తాజ్‌ డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎల్‌ఎల్‌ సిటీ మొమెంటమ్‌ ఇండెక్స్‌ 2020ను తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎల్ఎల్‌ కంట్రీ హెడ్‌, సీఈఓ రమేశ్‌ నాయర్‌, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జేఎల్‌ఎల్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ సమంతక్‌ దాస్‌, జేఎల్‌ఎల్‌ ఇండియా ఎండీ సందీప్‌ పట్నాయక్‌లు పాల్గొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 130 ముఖ్యమైన నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో బెంగళూరు, ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో ఢిల్లీ నిలిచాయి. ఇక టాప్‌ ట్వంటీలో మొత్తం 7 నగరాలు క్రియాశీల నగరాలుగా నిలిచాయి. పూణే 12వ స్థానం, కోల్‌కతా 16వ స్థానం, ముంబై 20 స్థానాలను అందుకున్నాయి.

ఈ ఏడాది టాప్‌-ట్వంటీలో మూడింట రెండొంతుల నగరాలు ఆసియా-పసిఫిక్‌కు చెందిన నగరాలే ఉన్నాయి. దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతోన్న నగరాల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు అధిక ఆసక్తిని చూపుతున్నారు. ఇందులో హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచిందని తెలిపింది జేఎల్‌ఎల్‌ ఇండియా. సామాజిక, ఆర్థిక పరంగా హైదరాబాద్‌, బెంగళూరు టాప్‌ పొజీషన్‌లో నిలిచినప్పటికీ... రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ కారణంగా ఈ ర్యాంకింగ్‌లో హైదరాబాద్‌ మొదటి స్థానం సంపాదించింది.

Tags

Read MoreRead Less
Next Story