ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణచివేయలేరు : లోకేష్ ఫైర్

అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకులు చేసిన తప్పేంటి.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుని కాలరాసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ట్విట్టర్ వేదికగా లోకేష్ నిప్పులు చెరిగారు. రాజధాని గ్రామాల్లో పోలీసుల లాఠీఛార్జీలు, ముళ్ల కంచెలతో ఉద్యమాన్ని అణచివేయలేరని ఆయన ఫైర్ అయ్యారు.
రాజధాని ఉద్యమాన్ని వైసీపీ ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూస్తే..అంతకి పదింతలు ఉద్యమం ఉధృతం అవుతుందన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన గొప్ప నిర్ణయమని వైసీపీ నాయకులు డప్పు కొడుతున్నారు..నిర్ణయం అంత గొప్పది అయితే సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లోకేష్. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com