ఆల్ టైమ్ హిట్‌గా 'అల వైకుంఠపురములో'..

ఆల్ టైమ్ హిట్‌గా అల వైకుంఠపురములో..
X

అల వైకుంఠపురములో .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ. ఆ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిందీ చిత్రం. నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేసి సంక్రాంతి బరిలో సత్తా చాటింది. విడుదలై వారం దాటినా.. నేటికీ అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతూ కలెక్షన్స్ స్టడీగా కొనసాగుతున్నాయి. సెకండ్ వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్స్ ఇంత స్టడీగా ఉండటం.. ఈ మధ్య కాలంలో రేర్ గా చూస్తున్నాం. అందుకే అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా టాక్ తెచ్చుకుంది.

గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన అల వైకుంఠపురములో ఓవర్శీస్ లో కూడా రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. కొన్నాళ్లుగా బాగా డల్ అయిన ఓవర్శీస్ మార్కెట్ కు ఓ రేంజ్ లో బూమ్ తెచ్చిందీ చిత్రం. ఇప్పటికే త్రీ మిలియన్ క్లబ్ లో చేరి అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాల పంట పండిస్తోంది. ఇటు ఇండియాలో వారం రోజుల్లో 118కోట్లు కలెక్ట్ చేసి సత్తా చాటింది. మరి ఆ కలెక్షన్స్ షేర్స్ రూపంలో ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం.

అల వైకుంఠపుములో వారం రోజుల కలెక్షన్స్ షేర్లలో

నైజాం - 28.28కోట్లు

సీడెడ్ - 15.45 కోట్లు

వైజాగ్ - 15.01 కోట్లు

గుంటూర్ - 8.58 కోట్లు

ఈస్ట్ గోదావరి - 8.12 కోట్లు

వెస్ట్ గోదావరి - 6.40 కోట్లు

కృష్ణా - 7.40 కోట్లు

నెల్లూర్ - 3.50 కోట్లు

ఏపి/ తెలంగాణ - 93.3 కోట్లు

కర్ణాటక - 9.3 కోట్లు

తమిళ్ నాడు, కేరళ - 3.25 కోట్లు

యూఎస్ - 9.0 కోట్లు

రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ - 3.25 కోట్లు

గ్రాండ్ టోటల్ - 118.1 కోట్ల షేర్

మొత్తంగా వారం రోజుల్లో 180కోట్ల గ్రాస్ తో పాటు 118.1 కోట్ల రూపాయల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను క్రియేట్ చేసి ఇప్పటికీ బాక్సాఫీస్ ను రూల్ చేస్తోంది అల వైకుంఠపురములో ..

Next Story

RELATED STORIES