రిలీజ్ కు ముందే హిట్ టాక్ తో డిస్కోరాజా

రిలీజ్ కు ముందే హిట్ టాక్ తో డిస్కోరాజా
X

మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ మూవీ డిస్కోరాజా.. విఐ ఆనంద్ డైరెక్షన్ లో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్, ఆర్ఎక్స్ 100 హాటీ పాయల్ రాజ్ పుత్, తాన్యాహోప్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విడుదలకు ముందే హిట్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఒక్కో టీజర్ తో ఓ రేంజ్ లో అంచనాలు పెంచుకుంటూ పోయింది. ముఖ్యంగా మాస్ రాజా లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది.

టీజర్ తో పాటు లేటెస్ట్ గా రవితేజ ఇమేజ్ తో పాటు డిస్కోరాజా మూవీ థీమ్ ఎలివేట్ అయ్యేలా ఓ అద్భుతమైన సాంగ్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేయకపోయినా అంతకు మించిన ఫీల్ ను ఈ సాంగ్ అందిస్తుండటం విశేషం. అలాగే రవితేజ చాలా రోజుల తర్వాత చేసిన వైవిధ్యమైన సినిమాగా చెబుతున్నారు. దర్శకుడు ఆనంద్ ఇలాంటి కథలను అద్భుతంగా డీల్ చేస్తాడు. అందుకు తోడు డిఫరెంట్ టైమ్ జానర్స్ లో సాగే కథగా వస్తోన్న ఈ మూవీ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఓ కొత్త ఫీల్ నిస్తుందని ఇండస్ట్రీ నుంచి కూడా పాజిటివ్ టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇక తమన్ సంగీతం సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. అల వైకుంఠపురములో సినిమాకు విడుదలకు ముందే ఆడియో ఎంత ప్లస్ అయిందో.. డిస్కోరాజాకు కూడా అంతే ప్లస్ గా నిలిచింది. ప్రతి పాటా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. నేపథ్య సంగీతం కూడా మరోసారి మెస్మరైజ్ చేస్తుందని వినిపిస్తోంది. సెన్సార్ నుంచి యూ బై ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న మాస్ రాజా ఈ సారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

Next Story

RELATED STORIES