గుంటూరులో జేఏసీ నిరసన ర్యాలీ

గుంటూరులో జేఏసీ నిరసన ర్యాలీ
X

rally

అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన ర్యాలీ జరిగింది. లాడ్జి కూడలి నుంచి సబ్‌జైల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఉద్యమిస్తున్న రైతులపై లాఠీఛార్జ్‌ చేయడం... నేతలను అరెస్టు చేయడాన్ని అమరావతి పరిరక్షణ సమితి ఖండించింది. నాయకులను వెంటనే విడుదల చేయాలని అంతా డిమాండ్ చేశారు.

మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ.. పరిరక్షణ సమితి నాయకులు నినాదాలు చేశారు. తర్వాత సబ్‌జైల్‌లో ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయ్‌దేవ్‌ను పరామర్శించారు. నిర్బంధ విధానాలను ప్రభుత్వం విడనాడాలని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కోరారు.

Tags

Next Story