జియో కస్టమర్లకు మరో తీపికబురు..

జియో కస్టమర్లకు మరో తీపికబురు..
X

jio-app

జియో మొబైల్ నెంబర్ ఉపయోగించే కస్టమర్ల కోసం రిలయన్స్ జియో యూపీఐ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా యాప్ నుంచే నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పంపొచ్చు. జియో సబ్‌స్క్రైబర్లు @jio లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్‌తో యూపీఐ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. జియో యూజర్లు వారి బ్యాంక్ అకౌంట్‌ను జియో యాప్‌లోని యూపీఐతో లింక్ చేసుకొని పేమెంట్ నిర్వహించొచ్చు. అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కి డబ్బులు పంపొచ్చు.

డబ్బులు పంపించడం, స్కాన్ అండ్ పే, రిక్వెస్ట్ మనీ, పాస్‌బుక్ వంటి పలు ఆప్షన్లు కస్టమర్లకు అందుబాటులో వుంటాయి. కస్టమర్లకు వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నా వాటన్నింటినీ మైజియో యాప్‌తో అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఈ యాప్ అతి త్వరలో కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ఇది కనుక వాడుకలోకి వస్తే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే వంటి వాటికి గట్టి పోటీ అవుతుంది. జియో కస్టమర్లందరూ మై జియో యాప్ ఉపయోగిస్తుంటారు. కావునా వాళ్లందరికీ యూపీఐ సేవలు అందుబాటులోకి వస్తాయి.

Next Story

RELATED STORIES