పోరాటానికి సిద్ధమైన పవన్.. పార్టీ కార్యాలయం దగ్గర మోహరించిన పోలీసులు

X
By - TV5 Telugu |21 Jan 2020 2:07 AM IST
నవ్యాంధ్ర రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన డిమాండ్ చేస్తోంది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన PAC సమావేశం జరుగుతోంది. రాజధాని అంశంపై పోరాట కార్యాచరణను పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. అటు రణరంగంగా మారిన రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. పవన్ బయటకు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు పవన్ వెంట రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com