అల వైకుంఠపురములో 10 రోజుల గ్రాస్ 220 కోట్లు

అల వైకుంఠపురములో 10 రోజుల గ్రాస్ 220 కోట్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో సినిమా అల వైకుంఠపురములో. ఈ చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ అందుకుంటారు అనుకున్నారంతా. కానీ అల వైకుంఠపురములో అంతకు మించి అనేలా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ కి సంబంధించి నాన్ బాహుబలి రికార్డ్స్ ని అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కేవలం 10 రోజుల్లోనే బ్రేక్ చేశారు.

హారికా హాసినా, గీతా ఆర్ట్స్ సంస్థల్లో భారీ బడ్జెట్ తో నిర్మించిన అల వైకుంఠపురములో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లోనే ఏకంగ 143 కోట్ల షేర్ సాధించింది. అంటే 220 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో నాన్ బాహుబలి రికార్డ్స్ అల వైకుంఠపురములో ఖాతాలో చేరాయంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సెకండ్ వీక్ నడుస్తున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ తో పాటు సంక్రాంతి సీజన్ కావడం కూడా కలిసొచ్చిందని చెప్పాలి.

అల వైకుంఠపురములో మొదటి 10 రోజుల షేర్ వివరాలు చూస్తే..

నైజాం – 35.69 కోట్లు

సీడెడ్ – 18.07 కోట్లు

ఉత్తరాంధ్ర – 18.80 కోట్లు

గుంటూరు – 9.93 కోట్లు

ఈస్ట్ – 9.89 కోట్లు

వెస్ట్ – 7.65 కోట్లు

కృష్ణ – 8.80 కోట్లు

నెల్లూరు – 4.07 కోట్లు

కర్ణాటక – 10.70 కోట్లు

తమిళనాడు,కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియా– 3.60 కోట్లు

యూఎస్ – 12.50 కోట్లు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 3.55 కోట్లు

మొత్తం 10 రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 112.90 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 143 కోట్ల షేర్ వచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్లు చూస్తే 220 కోట్లు సాధించి నాన్ బాహుబలి2 రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డులు సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story