రాజధానిపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

X
TV5 Telugu22 Jan 2020 10:40 AM GMT
రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది.. శాసన మండలిలో బిల్లులపై చర్చ జరుగుతోందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, మెజారిటీ సభ్యులున్నారని ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు డైరెక్షన్ ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కార్యాలయాల తరలింపును ఆపేందుకు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మండలిలో చర్చ జరుగుతున్నందున విచారణను రేపటికి వాయిదా వేసింది.
Next Story