సూపర్ రష్మిక.. సరిలేరు నీకెవ్వరు

సూపర్ రష్మిక.. సరిలేరు నీకెవ్వరు
X

అందానికి తోడు అభినయం.. వరుస సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెడుతోంది. ఏ సినిమాలో చూసినా రష్మికానే కనిపిస్తోంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు చేజిక్కించుకుంటోంది. సరిలేరు నీకెవ్వరూలో మహేష్‌తో జత కట్టిన రష్మిక నితిన్‌తో భీష్మలోనూ అవకాశం కొట్టేసింది. ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. తమిళంలో కార్తీ సరసన సైన్ చేసిన రష్మిక అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్లో వచ్చే ఓ చిత్రానికి ఓకే చెప్పేసింది.

మరి ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ తన అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మామూలుగా వర్కవుట్ చేస్తే సరిపోదని చాలా కష్టపడుతోంది. దాదాపు నిమిషం పాటు ఆపకుండా నాలుగు రకాల కసరత్తులు చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది చూసిన రష్మిక ఫ్యాన్స్.. సూపర్, మీ అంకితభావానికి హ్యాట్సాఫ్, మీరే మా ఇన్సిపిరేషన్ అంటూ తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది అమ్మడు.

Next Story

RELATED STORIES