డిగ్రీ అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు..

డిగ్రీ అర్హతతో ఆర్‌బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు..
X

రిజ.ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీ చేసింది. వాస్తవానికి దరఖాస్తు గడువు జనవరి 16తోనే ముగిసినప్పటికి అభ్యర్ధులకు మరికొంత వెసులుబాటు కల్పిస్తూ దరఖాస్తు గడువును జనవరి 24 వరకు పొడిగించింది. ఇప్పటివరకు అప్లై చేసుకోలేని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 14,15 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్ధులకు మార్చిలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

మొత్తం పోస్టులు 926.. (హైదరాబాద్: 25), రీజియన్ల వారీగా కేటాయింపు: అహ్మదాబాద్: 19, భోపాల్: 42, భువనేశ్వర్: 28, చండీగఢ్: 35, చెన్నై: 67, గువాహటి: 55, హైదరాబాద్: 25, జైపూర్: 37, జమ్మూ: 13, కాన్పూర్ & లక్నో: 63, కోల్‌కతా: 11, ముంబయి: 419, నాగపూర్: 13, న్యూఢిల్లీ: 34, పాట్నా: 24, తిరువనంతపురం & కొచ్చి: 20

అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పర్సంటేజ్‌తో పన్లేకుండా పాసైతే చాలు. అభ్యర్ధుల వయసు 01.12.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.12.1991 - 01.12.1999 మధ్య జన్మించి ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్ధులు నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story

RELATED STORIES