అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం

అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం
X

మేనల్లుడు అల్లు అర్జున్ సినిమాతోనే మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నారు. అంతలోనే విధి వంచించింది. విజయవాడలోని ఆయన నివాసంలో బుధవారం ప్రసాద్ కన్నుమూశారు. బన్నీ తల్లి నిర్మలాదేవికి రాజేంద్ర ప్రసాద్ సొంత అన్నయ్య. అల్లు అర్జున్‌కి పెద్ద మామయ్య. బన్నీకి మామయ్యతో ఎంతో అనుబంధం ఉంది. బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఆయన కన్నుమూశారు. ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మామయ్య మరణవార్త విన్న వెంటనే బన్నీ కుటుంబం విజయవాడకు బయల్దేరింది.

Next Story

RELATED STORIES