ధర్మం బతికే ఉందని మండలి ఛైర్మన్ షరీఫ్ నిరూపించారు: అమరావతి రైతులు

X
TV5 Telugu23 Jan 2020 2:50 PM GMT
దేశంలో ఇంకా ధర్మం బతికేఉందని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిరూపించారని హర్షం వ్యక్తం చేశారు అమరావతి రైతులు. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రలోబాలకు తలొగ్గకుండా న్యాయంగా వ్యవహరించారని పేర్కొన్నారు. 37 రోజులుగా తమ పోరాటానికి ప్రపంచానికి చూపించిన టీవీ5కి దన్యవాదాలు తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని అమరావతి రైతులు చెబుతున్నారు.
Next Story