నేను బానే ఉన్నాన్రా బాబు.. ఏంటా రాతలు..

నేను బానే ఉన్నాన్రా బాబు.. ఏంటా రాతలు..
X

నటుడు సునీల్ అస్వస్థతకు గురయ్యాడంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని సునీల్ స్వయంగా చెప్పుకొచ్చారు. TV-5తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన సునీల్ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపాడు. కేవలం సైనస్, ఇన్ఫెక్షన్ కారణంగానే హాస్పిటల్‌కు వెళ్లానని తెలిపాడు. డాక్టర్ల సూచనమేరకే హాస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు చెప్పాడు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తాను అస్వస్థతకు గురైనట్లు వార్తలు రాసుకొచ్చాయని అన్నాడు.

రెండు ప్రముఖ వెబ్‌సైట్లు, మీడియా సంస్థలు ఈ వార్తలు రాశారని చెప్పుకొచ్చాడు. నిక్షేపంలా ఉన్న నన్ను పేషెంట్‌ని ఎందుకు చేస్తార్రా అని వాపోతున్నాడు. నటులైనంత మాత్రాన జలుబులు, జ్వరాలు రావా. హాస్పిటల్‌కి వెళ్ళరా. చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ ఏంటా రాతలు అని సదరు మీడియా సంస్థల్ని విమర్శించాడు. టాలీవుడ్‌లో కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన సునీల్ ఆ తరువాత కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సునీల్‌కి హీరోగా అవకాశాలు తగ్గడంతో మళ్లీ కమెడియన్‌గా నటిస్తున్నాడు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో సునీల్ నటించాడు.

Next Story

RELATED STORIES