తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఐదు గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓవరాల్‌గా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆదిభట్ల, చౌటుప్పల్‌లో అత్యధికంగా పోలింగ్ నమోదు అవ్వగా.. నిజమ్‌పేట్‌లో అత్యల్ప పోలింగ్ నమోదైంది.
చాలాచోట్ల పోలింగ్ పరిసరాల్లో డబ్బుల పంపిణీ చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్ జిల్లాలో ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ -టిఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. మరికొందరు తమ ఓట్లు గల్లంతయ్యాయని, తమ ఓట్లను వేరే వారు వేశారంటూ పోలింగ్ బూత్‌ల దగ్గర ఆందోళనకు దిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com