2020 ఉద్యమ సంవత్సరంగా తెలంగాణ బీజేపీ నిర్ణయం

2020 ఉద్యమ సంవత్సరంగా తెలంగాణ బీజేపీ నిర్ణయం

2020 ఉద్యమ సంవత్సరం గా తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా.. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. నడ్డా పర్యటన తర్వాత తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.

కమల దళపతి గా పూర్తి బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డాతో.. బీజేపీలో కొత్త ఊపు వచ్చింది. కేంద్ర హోం మంత్రిగా అమీత్‌షా పూర్తి బాధ్యతలు చేపట్టడంతో పాటు వినుత్న బిల్లులను తీసుకురావడంతో.. జేపీ నడ్డా పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించనున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో జేపీ నడ్డా.. హైదరాబాద్ లోనే ఉండి తెలంగాణ బీజెపి ఎన్నికల మేనేజ్మెంట్ ను నిర్వహించారు. తెలంగాణలో పార్టీ బలాబలాలు పూర్తిగా అవగాహన ఉన్న జేపీ నడ్డా.. పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా రావడంతో, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన పూర్తి దృష్టి పెడతారని భావిస్తన్నారు. తెలంగాణలో బీజేపి టిఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం అని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపి ప్రయత్నం చేయబోతోంది.

తెలంగాణలోనూ మరోమారు అధ్యక్షుడిగా లక్ష్మణ్ కే అవకాశాలు మెండుగా ఉండటంతో మరింత దూకుడుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని లక్ష్మణ్ భావిస్తున్నారు. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు 2023 లో జరిగే సాధారణ ఎన్నికల్లో అధికారం దిశగా పార్టీని తీసుకెళ్లాలని లక్ష్మణ్ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎంఐఎంకు తొత్తుగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఒక వర్గం కోసమే ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజెపి భావిస్తోంది. మరోపక్క కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాదని బీజేపీ భావిస్తోంది. టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు మారాలి తప్ప సీఎంలు మారితే ప్రజలకు ప్రయోజనం ఉండదని, ఇందుకోసం పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు.

మూడు రాజధానుల అంశంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ శాఖతో కలిసి పని చేస్తున్నారు. తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ కి చెందిన జనసేన తో కలిసి నడవాలనే ఆలోచనలు కూడా తెలంగాణ బీజేపీ శాఖ ఉంది. దీనిపై త్వరలోనే హైదరాబాదులో పవన్ కళ్యాణ్ తో తెలంగాణలో కలిసి పని చేసేందుకు కూడా పార్టీ సిద్ధమైంది.

Read MoreRead Less
Next Story