రాజధాని తరలింపు అంశంపై విచారణ ఫిబ్రవరి26కి వాయిదా

X
TV5 Telugu23 Jan 2020 6:39 PM GMT
మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయన్నారు అడ్వకేట్ జనరల్. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు.
బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ జరగపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటీషనర్ల తరపు న్యాయవాది అశోక్ భాన్ కోరారు. దీనిపై స్పందించిన సీజే విచారణ పూర్తయ్యే లోపు కార్యాలయాలు తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.
Next Story