తాజా వార్తలు

పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ

పాపకు జన్మనిచ్చిన నటి స్నేహ
X

అందాల నటి స్నేహ మరోసారి రెండోసారి తల్లయ్యారు. తాజాగా పండంటి పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త హీరో ప్రసన్న వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ పెట్టారు. అందులో ఏంజెల్‌ వచ్చేసిందని పేర్కొన్నాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు స్నేహ-ప్రసన్న దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా తమిళ చిత్రం అచ్చముండు అచ్చముండుతో కలిసి నటించిన ఈ ఇద్దరు ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012 వీరిద్దరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే విహాన్‌ అనే బాబు ఉన్నాడు. విహాన్ పుట్టిన తరువాత స్నేహ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏవో అడపా దడపా సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అయితే ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన స్నేహ.. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.

Next Story

RELATED STORIES