అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ శ్రేణుల సంబరాలు

అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఏపీ శాసన మండలిలో వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మంత్రుల తీరుకు నిరసనగా... రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. అటు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటాలకుప పాలాభిషేకం చేశారు ప్రజలు.

అనంతపురం జిల్లా పెనుగొండలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లులు వీగిపోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్రగా అంబేద్కర్‌ సర్కిల్‌కు చేరుకుని రాజ్యాంగ నిర్మాతకు పాలాభిషేకం చేశారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి పాలభిషేఖకం చేశారు...

అటు చిత్తూరు జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పుంగనూరులో.... మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పటానికి పాలభిషేకం చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది.

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. కడపలో మంత్రి బొత్స దిష్టిబొమ్మను ఊరేగించారు. మండలి చైర్మన్‌ పట్ల మంత్రులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు టీడీపీ నేతలు. షరీఫ్‌ను కులం పేరుతో దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

అటు రాజమహేంద్రవరంలోనూ... టీడీపీ నేతలు మండలి ఛైర్మన్‌ షరీప్‌కు పాలాభిషేకం చేశారు. గోకవరం బస్టాండ్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు టీడీపీ నేతలు..

మైనార్టీలకు కించపరిచేలా మాట్లడిన మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు నగర మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌. బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ప్రయోజనాలను మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ కాపాడారాన్నారు..

అటు... పశ్చిమగోదావరి జిల్లాలోనూ.. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు పాలాభిషేకం చేశారు టీడీపీ నేతలు. రెండు బిల్లులను సెలెక్షన్‌ కమిటీకి పంపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. షరీఫ్‌ను అసభ్య పదజాలంతో దూషించిన మంత్రులను బర్తర్‌ చేయాలన్నారు..

ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి మంత్రి బొత్స వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. షరీఫ్‌ను కులంపేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి బొత్స క్షమాపణలు చెప్పకపోతే... వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు..

మొత్తానికి ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు.. వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళను చేశారు. అటు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ను పాలాభిషేకం చేస్తూ.. సంబరాలు జరుపుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story