గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..

గుర్రాలెక్కిన పెళ్లి కూతుళ్లు..

పెళ్లిపీటలు ఎక్కాల్సిన పెళ్లి కూతుళ్లు గుర్రాలు ఎక్కడమేంటని అనుకుంటున్నారా? సాధారణంగా పెళ్ళికి ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని గుర్రం మీద ఊరేగిస్తారు కానీ అక్కడ మాత్రం ముందుగా పెళ్లి కూతుళ్లను గుర్రం ఎక్కించి ఊరేగిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వ ప్రాంతంలో ఈ వినూత్న సంప్రదాయం ఉంది. ఖండ్వకు చెందిన ఇద్దరు అక్కాచెల్లళ్లు సాక్షి, సృష్టిల పెళ్లి జనవరి 22న జరిగింది. వారి సంప్రాదాయం ప్రకారం అక్కాచెల్లలు ఇద్దరు.. గుర్రాలపై బయలుదేరి పెళ్లి కుమారుల ఇళ్లకు చేరుకున్నారు. ఆ తరువాత భారీ బరాత్‌ నిర్వహించారు.

సమాజంలో అబ్బాయిలతోపాటుగా అమ్మాయిలకు కూడా సమాన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో తమ ప్రాంతంలో పెళ్లికూతుళ్ళను ఇలా గుర్రాల మీద ఊరేగిస్తారని పెళ్లికూతుళ్ల తండ్రి వెల్లడించారు. పాటిదార్‌ కులంలో పెళ్లి కూతుళ్లు గుర్రాలపై వెళ్లడమనే సంప్రాదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రతి తండ్రి ఈ సంప్రాదాయాన్ని పాటించి.. తద్వారా కూతుళ్లకు గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story