తాజా వార్తలు

లాటరీ దిశగా మోత్కూర్ మున్సిపాలిటీ?

లాటరీ దిశగా మోత్కూర్ మున్సిపాలిటీ?
X

యాదాద్రి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ ఉత్కంఠ రేపుతోంది. నువ్వా..నేనా.. అన్నట్టు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు తలపడ్డాయి. 12 వార్డుల్లో ఆరు టీఆర్ఎస్ గెలవగా, ఐదు కాంగ్రెస్ సొంతం చేసుకున్నాయి. ఇక ఏడో వార్డులో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు సమాన ఓట్లు రావటంతో గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో ఏడో వార్డులో రిపోలింగ్‌ జరిగే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ఫలితాన్ని బట్టి.. మున్సిపల్ పీఠం ఎవరిదన్న విషయం తెలియనుంది. ఒక వేళ ఇరుపార్టీలకు సమానమైన వార్డులు వస్తే లాటరీ వేయనున్నారు.

Next Story

RELATED STORIES