Top

కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌

కొనసాగుతున్న తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌
X

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల కౌంటింగ్ కొనసాగుతోంది. 120 మున్సిపాలిటీల్లో 2 వేల 727 వార్డులకు గాను.. 80 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మున్సిపాలిటీల్లో 2647 వార్డులకు ఫలితాలు వెలువడనున్నాయి.

ఇక 9 కార్పొరేషన్లలోని 324 డివిజన్లలో 3 ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం టీఆర్ఎస్ నుంచి బరిలో 2 వేల 975 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. కాంగ్రెస్ నుంచి 2 వేల 619 మంది, బీజేపీ నుంచి 2 వేల 321, టీడీపీ నుంచి 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది, సీపీఐ నుంచి 180 మంది, సీపీఎం నంచి 165 మంది, ఇతరులు 284 మంది, స్వతంత్రులు 3 వేల 760 మంది బరిలో ఉన్నారు.

ఓట్లు లెక్కింపునకు అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం 2 వేల 619 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఒక్కో టేబుల్‌ దగ్గర ముగ్గురు సిబ్బంది కౌంటింగ్‌ చేస్తున్నారు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌ పర్సన్‌ల ఎన్నిక జరగనుంది. కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక మాత్రం ఈ నెల 29 మేయర్‌ ఎన్నిక జరగనుంది.

Next Story

RELATED STORIES