భారీ భూకంపం.. 18 మంది మృతి

భారీ భూకంపం.. 18 మంది మృతి

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. దీంతో 18 మంది మృతి చెందారు. మరో 550 మందికి పైగా గాయపడ్డారు. రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. భూకంపం దాటికి నివాసితులు ఇళ్లు వదిలి వీధుల్లోకి పరుగెత్తారు. భూకంపం తర్వాత 60 సార్లు భూమి కంపించడంతో ఆస్తి నష్టం కూడా భారీగానే జరిగిందని టర్కీ డిజాస్టర్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ అధికారులు తెలిపారు. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఆహారం, దుప్పట్లు, అందించారు.

దేశంలోని అన్ని విభాగాల అధికారులు ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలని టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఈర్డాగాన్ ఆదేశించారు. గాజియన్టెప్‌ నగరానికి తూర్పున 218 కిలోమీటర్ల దూరంలో 15 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. అటు టర్కీకి పొరుగుదేశాలైన సిరియా, లెబనాన్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. కూలిన భవనాలలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయ చర్యలను ముమ్మరం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story