తాజా వార్తలు

గౌర‌వ ప్రదమైన స్ధానాలు సాధిస్తామ‌ని చ‌తికిల ప‌డిన కాంగ్రెస్

గౌర‌వ ప్రదమైన స్ధానాలు సాధిస్తామ‌ని చ‌తికిల ప‌డిన కాంగ్రెస్
X

ఉత్కంఠ గా ఎదురు చూసిన పుర పోరు ఫ‌లితాలు కాంగ్రెస్‌కు నిరాశనే మిగిల్చాయి. గౌర‌వ ప్రదమైన స్ధానాలు సాధిస్తామ‌న్న కాంగ్రెస్.. చ‌తికిల ప‌డింది. అధికార టిఆర్ఎస్ గెలుపుకు ద‌రిదాపుల్లో హ‌స్తం పార్టీ నిల‌వ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ క్యాడ‌ర్ లో నైరాశ్యం నెల‌కొంది. 120 మున్సిపాల్టీలో సింగిల్ డిజిట్ కి ప‌రిమితం అయింది. కార్పోరేష‌న్ల‌లో ఒకటి కూడా ద‌క్కించుకోలేక‌పోయింది.

మున్సిపల్ ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పుకుంటానని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడంతో ఆశవహులంతా ఈ ఎన్నికలను తమ పట్టు పెంచుకోవడానికి మంచి అవకాశంగా భావించారు. ఎన్నికల్లో సత్తా చాటి పీసీసీ రేసులో ముందుండాలని కసితో పనిచేశారు. కానీ తామోకటి తలిస్తే దైవం ఒకటి తలచిందనట్లు ఫలితాలు మాత్రం నేతలకు భారీ షాక్ ఇచ్చాయి. ఇక మున్సిపాలిటీల్లో విజయంతో గౌరవంగా తప్పుకోవలనుకున్న ఉత్తమ్ కు నిరాశే మిగిలింది. ఇక సీఎల్పీ నేత భట్టి కూడా నియోజక వర్గంలోనే తిష్ట వేసి ప్రచారం చేసినా పార్టీని గెలిపించుకోలేకపోయారు. అంతో ఇంతో ఒక్క కోమ‌టి రెడ్డి బ్రదర్స్ మాత్రమే ఈ ఎన్నిక‌ల్లో తమ పట్టు నిలుపుకున్నారని చెప్పొచ్చు. వారు మిన‌హా ఎవరూ కూడా క‌నీసమైన స్ధానాలు సాధించలేకపోయారు. పార్టీకి ఆరుగురు శాస‌న‌స‌భ్యులు,ముగ్గురుఎంపిలు ఓ ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకా చాల మంది సీనియ‌ర్లు ఉన్నారు. ఇందులో మ‌ధు యాష్కి, పొన్నాల ,జానారెడ్డి, చెన్నారెడ్డి,జ‌గ్గారెడ్డి, గీతారెడ్డి వంటి సీనియ‌ర్ల ఇలాఖాల్లో కూడా పార్టీ గెలువలేకపోయింది.

మ‌రో వైపు లీడ‌ర్లు లేని చోటా కాంగ్రెస్ క్యాడ‌ర్ అధికార పార్టీకి ధీటుగా పోటీ ఇచ్చింది. చాల చోట్లా కాంగ్రెస్ లోక‌ల్ క్యాడ‌ర్ మాత్రమే ఒంట‌రి పోరాటం చేసింది. మరోవైపు చాలా చోట్ల బిజేపి, టిఆర్ఎస్ రెబ‌ల్స్ కంటే తక్కువ స్ధానంలో నిల‌వ‌డంతో కేడర్‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. అయితే చైర్మన్ పీఠాలు దక్కించుకోలేక పోయిన హస్తం పార్టీ 535 డివిజన్లలో గెలవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు.

Next Story

RELATED STORIES