గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు మహాహారతి కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతమాతకు మహాహారతి కార్యక్రమం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో భారతమాతకు మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాలు శోభాయమానంగా కనిపించాయి. దేశభక్తిని చాటి చెప్పేలా విద్యార్థులు, కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సరిహద్దుల్లో జవాన్లు చేపట్టే యుద్ధ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

రెండేళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామని.. అప్పటి నుంచి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఒక తిరుగులేని శక్తిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై ప్రసంగించారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చేలా కార్యక్రమం నిర్వహించారని కొనియాడారు.

Tags

Read MoreRead Less
Next Story