అంతకంతకూ ఉధృతమవుతున్న అమరావతి రైతుల నిరసనలు

అంతకంతకూ ఉధృతమవుతున్న అమరావతి రైతుల నిరసనలు

అమరావతిలో రాజధాని రైతులకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. పక్క రాష్ట్రాల రైతులు సైతం అమరావతికి బాసటగా నిలుస్తున్నారు. 41 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న రాజధాని రైతులకు.. కర్నాటక రైతులు మద్దతు తెలిపారు. అయితే.. రాజధాని రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కర్నాటక రైతులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వారందరినీ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీసుల వైఖరిపై అమరావతి పరిరక్షణ సమితి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్‌ ఎదుట ఆందోళన దిగారు.

అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కర్ణాటక రైతులను పోలీసులు అరెస్టు చేయడంపై.. ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే రైతులను విడుదల చేయాలని.. లేదంటే తానే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు వస్తానని హెచ్చరించారు. సాటి రైతులకు సంఘీభావం తెలపడమే కర్ణాటక రైతులు చేసిన తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు.

శానసన మండలి రద్దుపై అమరావతి పరిరక్షణ సమితి మండిపడింది. రాజధానిని తరలించాలన్న ఏకైక ఉద్దేశంతోనే మండలిని రద్దు చేశారని సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి పునరుద్ధరించిన మండలికి కొడుకు మంగళం పాడుతున్నారని అన్నారు.

అటు రైతులు 41వ రోజు కూడా రాజధాని గ్రామాల్లో నిరసనలు హోరెత్తాయి. అమరావతి తరలింపునకు వ్యతిరేకంగా మహిళలు తమ దీక్షలు కొనసాగించారు. మండలి రద్దు చేసినా.. ఉద్యమం ఆపేది లేదన్నారు. అమరావతిని తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వెలగపూడిలో పెద్దయెత్తన ఆందోళన చేపట్టారు.

అమరావతి తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేశారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయలేరని అన్నారు. 41వ రోజూ రిలే దీక్షలు కొనసాగింయాచారు. రాజధాని కోసం ప్రాణాలైన ఆర్పిస్తామని తేల్చిచెప్పారు. ఊపిరి వున్నంత వరకు రాజధానికోసం పోరాడాతమన్నారు తుళ్లూరు రైతులు. తమ ఉద్యమాన్ని ఏ శక్తీ ఆపలేదని హెచ్చరించారు. పోలీసులతో అనచివేయాలని చూస్తే.. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అమరావతి తరలింపు కోసం.. ఏకంగా శానమండలిని రద్దు చేసేంతగా వైసీపీ సర్కార్ దిగజారిందని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన మండలిని రద్దు చేయలేరని అన్నారు. మొత్తానికి, 41వ రోజు కూడా అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగింది.

Tags

Read MoreRead Less
Next Story