చదువుల తల్లికి చైర్మన్ పదవి.. 25 ఏళ్లకే మున్సిపల్ ఎన్నికల్లో విజయం

చదువుల తల్లికి చైర్మన్ పదవి.. 25 ఏళ్లకే మున్సిపల్ ఎన్నికల్లో విజయం

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 ఏళ్ల జాహ్నవి ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన జాహ్నవి ఎంఏ బీఈడీ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. ఓ పక్క లా చదువుతూనే మరోపక్క సివిల్స్‌కి ప్రిపేరవుతున్నారు. ప్రజలకు మరింత దగ్గర కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినా జాహ్నవి కుటుంబ నేపథ్యం రాజకీయాలతో ముడిపడే ఉంది. తల్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా, తండ్రి వేణుగోపాలరావ్ మున్సిపల్ కౌన్సిలర్‌గా పలు సార్లు ఎంపికయ్యారు. బాబాయ్ కృష్ణమోహన్ కౌన్సిలర్‌గా, కో ఆప్షన్ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం జాహ్నవితో పాటు బాబాయి కూడా కౌన్సిలర్‌గా గెలుపొందారు.

Tags

Read MoreRead Less
Next Story